పాత ప్యాంటు జేబులో రూ. 57 కోట్ల లాటరీ టికెట్.. చివరి నిమిషంలో మారిన తలరాత!
- ఏడాది క్రితం కొని పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి
- గడువు ముగియడానికి 8 రోజుల ముందు వెలుగులోకి
- లాటరీ అధికారుల ప్రకటనతో ఇంట్లో వెతకగా దొరికిన అదృష్టం
- అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఆసక్తికర ఘటన
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ వ్యక్తి విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. దాదాపు ఏడాది క్రితం కొని, పూర్తిగా మర్చిపోయిన ఓ లాటరీ టికెట్.. అతడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. గడువు ముగియడానికి కేవలం 8 రోజుల ముందు, ఓ పాత ప్యాంటు జేబులో ఆ టికెట్ దొరకడం ఈ కథలో అసలు ట్విస్ట్.
వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీకి చెందిన ఆ వ్యక్తి గతేడాది మే నెలలో తాను తరచూ వెళ్లే ఓ గ్యాస్ స్టేషన్లో పిక్-6 లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అయితే, కొన్న తర్వాత ఆ టికెట్‌ను ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. దాదాపు ఏడాది పాటు దాని గురించి అతడికి గుర్తురాలేదు.
ఇటీవల లాటరీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. జాక్‌పాట్ గెలిచిన టికెట్ ఒకటి ఇంకా ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదని, త్వరలోనే దాని గడువు ముగిసిపోతుందని తెలిపారు. తాను తరచూ వెళ్లే గ్యాస్ స్టేషన్లోనే ఆ టికెట్ అమ్ముడైందని తెలియడంతో ఆ వ్యక్తికి ఆసక్తి కలిగింది. వెంటనే అక్కడికి వెళ్లి సిబ్బందిని విచారించగా, తమ రెగ్యులర్ కస్టమర్లలో కొద్దిమంది మాత్రమే ఆ లాటరీలో పాల్గొంటారనీ, ఇంట్లో జాగ్రత్తగా వెతుక్కోమని వారు సలహా ఇచ్చారు.
దీంతో ఇంటికి వచ్చిన అతను.. బీరువాలు, అరలు, పాత వస్తువులన్నీ వెతికాడు. చివరకు పాత బట్టలు ఉన్న చోట వెతుకుతుండగా ఓ పాత ప్యాంటు జేబులో నలిగిపోయిన ఆ లాటరీ టికెట్ కనిపించింది. నంబర్లు సరిచూసుకోగా, తాను గెలుచుకున్నది 5.9 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 57.11 కోట్లు) జాక్‌పాట్ అని తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వెంటనే లాటరీ కార్యాలయానికి వెళ్లి గడువుకు 8 రోజుల ముందే బహుమతిని క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో పాత టికెట్లను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని, చాలామంది విజేతలు వాటిని ఎక్కడ పెట్టారో మర్చిపోయి బహుమతులు కోల్పోతున్నారని లాటరీ అధికారులు ప్రజలకు సూచించారు.